Telangana : బీఆర్ఎస్ సభపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ సభపై సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ సభపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ అక్కసుతో మాట్లాడినట్లుందన్న రేవంత్ రెడ్డి గత పదేళ్ల కాలంలో తెలంగాణ ఖజనాను లూటీ చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. తాము బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు ఎన్ని కావలంటే అన్ని ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో ఖమ్మంలో జరిగిన రాహుల్ సభకు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
పదేళ్ల విధ్వంసాన్ని...
పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సమయం పట్టిందన్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉందని, దానిని ఎవరి ముందో బయటపెట్టుకోవాల్సిన అవసరం, చెప్పుకోవాల్సిన పనిలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మావోయిస్టులతో చర్చల విషయంపై జానారెడ్డితో మాట్లాడానని, గతంలోనూ జానారెడ్డి, కేకే మావోయిస్టులతో జరిపిన చర్చల్లో కీలకంగా వ్యవహరించడంతో ఆయనను కలసి అభిప్రాయాలను తెలుసుకునేందుకు తాను జానారెడ్డి ఇంటికి వచ్చానని రేవంత్ రెడ్డి తెలిపారు.