Revanth Reddy : ఎమ్మెల్యేల పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
పార్టీ మారిన ఎమ్మెల్యేపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ కాంగ్రెస్ కండువా కప్పలేదని తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ పార్టీ మారినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.కండువాలు కప్పినంతమాత్రాన పార్టీ మారినట్లు కాదని, తాను ఈరో్జు కూడా ఢిల్లీలోజరిగిన కార్యక్రమంలో చాలా మందికి కండువాలు కప్పానని, వారు ఏ కండువా కప్పారన్నది చూసుకోలేదని తెలిపారు.
కేసీఆర్ కుటుంబంపై కీలక వ్యాఖ్యలు...
కేసీఆర్ కుటుంబసభ్యులపైన కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తాను కవితను ఎక్కడా సపోర్టు చేయలేదన్న రేవంత్ రెడ్డి, వాళ్ల కుటుంబ పంచాయతీలో తనకు సంబంధం లేదని తెలిపారు. వాళ్లది ఆస్తుల పంచాయతీ అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వాళ్ల పంచాయతీకి తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని రేవంత్ రెడ్డి అన్నారు. వారిది కుటుంబ సమస్యఅన్న రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్ రావు తమకు 37 మందిసభ్యుల బలం ఉందని, వాళ్లకు తగినట్లుగా సమయం కేటాయించాలని అసెంబ్లీలో కోరిన విషయాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.