Revanth Reddy : ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశముంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పార్టీ అగ్రనేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశముంది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ అగ్రనేతలతో చర్చించనున్నారు. తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మూడో తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది.
ఆశావహులు కోసం...
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో నాలుగు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి. దీంతో నలుగురు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధినాయకత్వంతో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇప్పటి వరకూ పదవుల కోసం అనేక మంది పోటీ పడుతుండటంతో ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. పార్టీ హైకమాండ్ తో చర్చించి ఫైనల్ లిస్ట్ ను తయారు చేయనున్నారు.