Revanth Reddy : రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డిపై కాసం వెంకటేశ్వర్లు వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో నాంపల్లి కోర్టులో కాసం వెంకటేశ్వర్లు పిటీషన్ వేశారు.అయితే రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల పై చేసిన వ్యాఖ్యలపై కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలుపుతూ ఈ పిటీషన్ నాంపల్లి కోర్టులో వేశారు.
రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు...
అయితే దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేయడంతో నేడు హైకోర్టు దానిని కొట్టివేసింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ కేసులో ఊరట లభించినట్లయింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి క్వాష్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించిండంతో ఆయనకు రిలీఫ్ దక్కింది. బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు ఈ పిటీషన్ ను దాఖలు చేశారు.