కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా : కేసీఆర్

కేంద్రాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

Update: 2022-12-04 12:13 GMT

కేంద్రాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతామని హెచ్చరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. నిధులు ఇవ్వడం లేదన్నారు. మేధావులు, యువకులు, విద్యావంతులు దీనిని తిప్పికొట్టేందుకు సహకరించాలని కోరారు. భావోద్వేగాలను, విధ్వేషాలను రెచ్చగొట్టి దౌర్జన్యంగా అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మోదీ సర్కార్ మోసం కారణంగా మూడు లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ కోల్పోయిందన్నారు.

కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప...
లేకుంటే ఇంకా జీఎస్‌డీపీ పెరిగి ఉండేదని అన్నారు. కృష్ణా జిల్లాలో వాటా తేల్చేందుకు మోదీకి ఎనిమిదేళ్లు కూడా సరిపోలేదన్నారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏం చేయడం లేదని, కాళ్లలో కట్టెలు పెట్టడం తప్ప అని కేసీఆర్ ధ్వజమెత్తారు. పోరాటం చేసి సాధించి తెచ్చుకున్న తెలంగాణను మోదీ ప్రభుత్వం ఆగం చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు లేకుండా ఉండేందుకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు ఐటీ హబ్ గా మారబోతుందని ఆయన అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేసీఆర్ ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకూ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.


Tags:    

Similar News