Telangana : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. కులగణన సర్వేపై చర్చించి ఆమోదించనుంది.
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఉదయం పదిగంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కులగణన సర్వేపై చర్చించి ఆమోదించనుంది. బీసీ రిజర్వేషన్లపై చర్చించనుంది. ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో ముందుగా కేబినెట్ భేటీ కావాలని నిర్ణయించింది.
కులగణన అంశంపై...
ఈ కేబినెట్ భేటీలో కేవలం కులగణన అంశంపైనే చర్చించనున్నారు. మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను కేబినెట్ సమావేశం ఆమోదించనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్లపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు ఎస్సీ వర్గీకరణపై కూడా కేబినెట్ చర్చించనుంది. డెడికేషన్ కమిటీ నివేదికలు కూడా కేబినెట్ ముందుకు రానున్నాయి.