Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే

ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది

Update: 2026-02-23 03:05 GMT

ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. యాసంగి రైతు భరోసా నిధుల రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ కేబినెట్ ఇవ్వనుంది. ఉద్యోగుల క్యాష్‌లెస్ వైద్యానికి బేసిక్లో 1.5 % కట్ చేయనుంది. రెసిడెన్షియల్ స్కూల్స్‌, డీసీసీబీ భవన నిర్మాణాలకు, భూములు, మెట్రో టేకోవర్ స్టేటస్‌పై చర్చ జరగనుంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోనుంది. బడ్జెట్ రూపకల్పనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పరీక్షల తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీస్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

బడ్జెట్ రూపకల్పనపై...
సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ కీలక భేటీలో ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుతోపాటు వార్షిక బడ్జెట్ పద్దుల ప్రపోజల్స్‌పై మంత్రులు సుదీర్ఘంగా చర్చించనున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చే హెచ్‌ఎంఆర్‌ఎల్ మెట్రో టేకోవర్ పురోగతి, అదనపు బోగీల ఏర్పాటు, మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవనంలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపైనా లోతైన చర్చ జరగనున్నది. దేవాదుల ప్యాకేజీ-3 పనుల కొనసాగింపునకు అవసరమైన పరిపాలనాపరమైన అనుమతులను ఆమోదించనున్నారు. కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో (జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి) ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.


Tags:    

Similar News