ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2026-02-23 03:37 GMT

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం ఉట్నూరు మండలం శ్యామ్ పూర్ లో బ్రిడ్జి పై నుంచి అర్టీసీ బస్సు కిందపడింది. దీంతో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి లోనైంది. ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ లోని బ్రిడ్జి పై నుంచి బస్సు కింద పడిపోవడంతో ఐదుగురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది వరకూ ప్రయాణికులున్నారని తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని చికిత్స కోసం అసుపత్రికి తరలించారు. ఇరుకుగా ఉన్న ఈ బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న స్థానికులు చెబుతున్నారు.


Tags:    

Similar News