Maoists : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. కీలక నేతల దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లొంగు"బాట"

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది

Update: 2026-02-22 05:32 GMT

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల ఆపరేషన్ ఫలించింది. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. ఇప్పటికే వారు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నారని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పటికే అగ్రనేతలు అందరూ సాయుధ పోరాటాన్ని విడిచి పోలీసులకు సరెండర్ అయ్యారు. మరికొందరు మాత్రం ఎన్ కౌంటర్లలో మరణించారు.

వీరిద్దరి లొంగుబాటుతో...
అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డిలు లొంగిపోవడంతో ఇక మావోయిస్టుల ఉద్యమం పూర్తిగా అదృశ్యమైందని పోలీసులు భావసి్తున్నార. మార్చి 31వ తేదీ కల్లా ఆపరేషన్ కగార్ కు కేంద్రం ప్రభుత్వం గడువు విధించింది. ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు, కీలక నేతలైన హిడ్మా వంటి వారు కూడా ఎన్ కౌంర్టలలో మరణించారు. దాదాపు కేంద్ర కమిటీలో ఉన్న వారంతా ఇప్పటికే లొంగిపోయారు. ఇప్పుడు తాజాగా వీరిద్దిరి లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్టుఉద్యమం పూర్తిగా ముగిసిపోయిందని అంటున్నారు.
నాలుగు దశాబ్దాలకుపైగా...
మరో మావోయిస్టు అగ్రనేత గణపతి విదేశాల్లో ఉన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి స్వస్తి పలికి వీరంతా ఇక పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్ జీతో పాటు మల్లా రాజిరెడ్డి కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఇక ఉద్యమాన్ని మందుకు తీసుకెళ్లలేమని భావించిన వారు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల చేయనున్నారు. వీరితో పాటు పదహారు మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం.















Tags:    

Similar News