Bandi Sanjay : కామారెడ్డి ఘటనపై బండి సంజయ్ ఏమన్నారంటే?
కామారెడ్డి లో జరిగిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు
కామారెడ్డి లో జరిగిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంపై దాడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడాన్ని ఆయన ఖండించారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తు్న్నారని ప్రశ్నించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంలోకి కాంగ్రెస్ నేతలు దూసుకు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే...
తెలంగాణలో ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడికి రక్షణ ఈ ప్రభుత్వం ఎలా కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపు తప్పాయన్న బండి సంజయ్ పోలీసులు ప్రతీకార దాడులు జరుగుతాయని తెలిసినా ముందు జాగ్రత్తగా ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఇటువంటి ప్రతీకార రాజకీయాలను బీజేపీ ఖండిస్తుందని తెలిపారు.