Telangana : ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది

Update: 2025-08-01 12:16 GMT

ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం కమిటీపై కమిషన్ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం కమిటీని నియమించింది.

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై...
కమిటీలో సభ్యులుగా నీటీపారుదల శాఖ సెక్రటరీ, సభ్యులుగా జీఏ డీ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ నివేదక మేరకు కమిషన్ నివేదికలో ఏదైనా అవకతవకలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మరొకవైపు ఇదే సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీని కూడా నిర్ణయించే అవకాశముంది.


Tags:    

Similar News