Telangana : విస్తరణ అంత సులువా? రేవంత్ రెడ్డికి ఈజీ మాత్రం కాదట

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది

Update: 2026-04-07 12:53 GMT

తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. మరోసారి అదే రకమైన ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మంత్రి వర్గ విస్తరణ చేయాలంటే అందుకు హైకమాండ్ అనుమతి తప్పనిసరి. హైకమాండ్ సూచన మేరకు మాత్రమే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? ఎవరిని మంత్రివర్గం నుంచి తొలగించాలి? అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. పీసీసీ చీఫ్ కానీ, ముఖ్యమంత్రి తో సంబంధం ఉండదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే రకమైన తీరులో ఎప్పుడూ ఉంటుంది. అందుకు తెలంగాణ రాష్ట్రం అతీతం కాదు.

రాజకీయ ఇబ్బందులను...
సాఫీగా సాగిపోయే దానిని మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి ఇబ్బందులు రాజకీయంగా కొని తెచ్చుకోవడం ఎందుకని సహజంగా హైకమాండ్ ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనల మేరకు పార్టీ హైకమాండ్ నడుచుకోదు. అలా జరిగి ఉంటే ఇప్పటి వరకూ రెండు మంత్రి పదవులు భర్తీ కాకుండా ఉండేవి కావన్నది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. అందుకే మంత్రి వర్గ ప్రక్షాళన రేవంత్ రెడ్డికి అంత సులువవు కాదన్నది అందరూ ఒప్పుకునే సత్యమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు. జాతీయ పార్టీ. ఆ పార్టీతో అనేక మంది రాష్ట్ర నేతలకు సత్సంబంధాలున్నాయి.
ఢిల్లీలో లాబీయింగ్...
నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేయగల సమర్థత ఉన్న నేతలున్నారు. అలాంటి సమయంలో ఎన్నికల టీం అంటూ తాను మంత్రి వర్గ ప్రక్షాళన చేస్తామంటే కుదరనే కుదరదు. మంత్రి పదవుల్లోకి కొత్త వారిని నియమించినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ ఉండదన్న అభిప్రాయం కూడా ఉండదు. ఉన్న వారిని తొలగిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. సామాజికవర్గాల కోణంలో చూసినప్పటికీబలమైన నేతలను కేబినెట్ నుంచి తప్పిస్తే పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న భావన వ్యక్తమవుతుంది. అలాగని రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుపోటములకు తాను బాధ్యుడిని కాని చెప్పే అవకాశముంది. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎప్పుడు మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది? అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News