BJP : నేడు బీజేపీ నేతల కీలక భేటీ
తెలంగాణ బీజేపీ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు
తెలంగాణ బీజేపీ నేతలు నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి నేతలందరూ హాజరు కానున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై...
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అన్ని రకాల వ్యూహాలపై నేడు చర్చించనున్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయి నేత ఒకరిని ఇన్ ఛార్జిగా నియమించే అవకాశముంది.