Telangana : నేడు బీజేపీ నేతల సమావేశం
నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ప్రాజెక్టులపై మాట్లాడనున్నారు
నేడు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ప్రాజెక్టులపై మాట్లాడనున్నారు. గత కొద్దిరోజులుగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపైన కూడా కొన్ని విమర్శలు రెండు పార్టీలు చేయడంతో నేడు మీడియా సమావేశంలో రాంచందర్ రావు సాగునీటి ప్రాజెక్టులపై వివరణ ఇవ్వనున్నారు.
మున్సిపల్ ఎన్నికలపై...
మరొకవైపు నేడు హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు, అభయ్ పాటిల్ లు పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.