Telangana : నేడు బీజేపీ కీలక సమావేశం
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. త్వరలో జరగనున్న సంస్థాగత ఎన్నికలపై సునీల్ బన్సల్ నేతలతో చర్చించనున్నారు. దీంతో పాటు తెలంగాణలో పార్టీ బలోపేతం పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
నేతల అభిప్రాయాలను...
తెలంగాణ సంస్థాగత ఎన్నికల్లో ఎవరి పేరును ఖరారు చేయాలన్న దానిపై నేతల అభిప్రాయాలను సునీల్ బన్సల్ తీసుకోనున్నారు. దీంతో పాటు కాశ్మీర్ లోఉగ్రవాదులు జరిపిన దాడులు, వక్ఫ్ బోర్డు బిల్లు, ఇతర అంశాలపై ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లేందుకు నేతలను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.