Telangana : 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశలు ప్రారంభం కానున్నాయి
Assembly Meetings Speaker Election
ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల9వ తేదీ ఉదయం10.30 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపింది. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో దీనికి ప్రాధాన్యత ఉంది.
ముఖ్యమైన అంశాలపై...
కీలకమైన అంశాలపై సభలో చర్చించనున్నారు. ప్రధానంగా హైడ్రా, మూసీ నది ప్రక్షాళనతో పాటు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలపై చర్చ జరిగే అవకాశముంది. విపక్షాలు కూడా కొన్ని అంశాలపై చర్చకు పట్టుబట్టే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై విపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో సమావేశాలు హాట్ హాట్ గా సాగే అవకాశముంది. అధికార పార్టీ, విపక్షాల మధ్య వాదలను, ప్రతివాదనలు జరిగేందుకు ఈ సమావేశాల్లో ఎక్కువ ఛాన్స్ ఉంది.