Telangana : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించడానికి ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉభయ సభల్లో ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి చర్చ చేపట్టనున్నారు. కొంతకాలం క్రితం మరణించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించి సభ తీర్మానం చేయనుంది.
చర్చించాల్సిన అంశాలపై...
అయితే సంతాప తీర్మానం తర్వాత సభను వాయిదా వేస్తారంటున్నారు. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్నది నిర్ణయిస్తారు. ఏఏ అంశాలను చర్చించాలన్నది కూడా నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ పై నివేదికను నాలుగు రోజుల పాటు చర్చించే అవకాశముంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లతో పాటు ఇటీవల సంభవించిన వరదలకు నష్టం వంటి అంశాలపై చర్చించే అవకాశముంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.