Telangana : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన వెంటనే జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాధ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు

Update: 2025-08-30 05:37 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమయిన వెంటనే జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాధ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని అన్ని పార్టీల నాయకులు ఆమోదించారు. తెలంగాణకు, ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాధ్ చేసిన సేవలను పలువురు మంత్రులు, పార్టీ నేతలు కొనియాడారు.

మాగంటి గోపీనాధ్ మృతికి...
మాగంటి గోపీనాధ్ తనకు మంచి మిత్రుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను, నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు. ఈ తీర్మానంపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను స్పీకర్ గడ్డం ప్రసాదరావు వాయిదా వేయనున్నారు. తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో పాల్గొనే అవకావముంది. శాసనసభలో చర్చించాల్సినఅంంశాలతో పాటు సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న దానిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News