Telangana : అసెంబ్లీ కులగణన సర్వేను ప్రవేశపెట్టిన రేవంత్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో కులగణన సర్వే ను ప్రవేశ పెట్టారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో కులగణన సర్వే ను ప్రవేశ పెట్టారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సమగ్ర సర్వే చేపట్టామని తెలిపారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజుల సమయం పట్టిందని తెలిపారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసమే ఈ కులగణనను చేపట్టామని చెప్పారు. తెలంగాణలో మొత్తం 96.6 శాతం వరకూ సర్వే పూర్తయిందని రేవంత్ రెడ్డి తెలిపారుబీసీలు 46.45 శాతం మంది ఉన్నారన్నారు.
బీసీలు యాభై ఆరు శాతం మంది...
బీసీలను కలుపుకుంటే యాభై ఆరు శాతం మంది ఉన్నాని తెలిపారు. సరైన సమాచారం లేకపోవడం వల్ల అభివృద్ధి ఫలాలను సక్రమంగా అందించలేక పోతున్నామని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లను కల్పించలేకపోతున్నామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్టీలు 10.45 శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ సర్వే వల్ల అనేక ప్రయోజనాలు బలహీనవర్గాల వారికి అందించడంలో తమ ప్రభుత్వం ముందుందుంటుందని తెలిపారు. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేసినేడు అసెంబ్లీలో నివేదికను ఉంచుతున్నామని తెలిపారు. ఓసీలు 15.79 శాతం మంది ఉన్నారని తెలిపారు.