Mallu Bhatti Vikramarka : మీలాగా ఫామ్ హౌస్ లో కూర్చోలే.. సహాయక చర్యలను చేపట్టాం : భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. రాత్రి నుంచి ముఖ్యమంత్రితో పాటు అందరూ వరద పరిస్థితిపై సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి, మెదక్, సిరిసిల్లా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని సహాయక చర్యలను చేపట్టాని ఆదేశించారని భట్టి విక్రమార్క తెలిపారు.
ప్రజల బాగోగులను...
మీ లాగా ఫామ్ హౌస్ లో కూర్చునే ప్రభుత్వం తమది కాదని అన్నారు. తాము ప్రజల బాగోగులను పట్టించుకుంటామని చెప్పారు. బాగా ప్రభావితమైన మెదక్, కామారెడ్డి జిల్లాలకు సహాయక బృందాలను పంపామన్న భట్టి విక్రమార్క అక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ఎవరి వల్లా కాదన్న విషయం కేటీఆర్ కు తెలిసినా కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని, మీ నాయనలాగా ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రజలను పట్టించుకోకుండా తాము ఉండలేదని స్పష్టం చేశారు.