కవితకు తీన్మార్ మల్లన్న మాస్ వార్నింగ్

తన కార్యాలయంలపై దాడి ఘటన వెనక కల్వకుంట్ల కుటుంబం ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు

Update: 2025-07-13 12:43 GMT

తన కార్యాలయంలపై దాడి ఘటన వెనక కల్వకుంట్ల కుటుంబం ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందన్నారు. అయితే ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోతుందని భావిస్తే అధి భ్రమేనని అన్నారు. ఉదయం 11.30 గంటలకు తమ కార్యాలయంపై దాదాపు ముప్ఫయి మంది దాడులకు పాల్పడ్డారని, గన్ మెన్లు అడ్డుచెప్పినా వినకుండా లోపలికి వచ్చి దాడి చేయడంతో తన చేతికి గాయమయిందన్నారు.

తనపై హత్యాయత్నాన్ని...
దీంతో తన గన్ మెన్ నుంచి తుపాకీని లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అయితే ఈరకమైన బీసీలు, అణగారినవర్గాలను అధికారంలోకి తీసుకురావాలన్నతాము చేసే ప్రయత్నంలో ఏమాత్రం వెనక్కు తగ్గమని తీన్మార్ మల్లన్న అన్నారు. దాడులకు భయపడి వెనక్కు తగ్గే వాడిని కానని, రానున్న మూడేళ్లలో రాజకీయంగా మిమ్మల్ని పాతాళానికి తొక్కే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.


Tags:    

Similar News