Sigachi Industry : రేపు సిగాచీ పరిశ్రమకు షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం

రేపు పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది

Update: 2025-07-07 07:46 GMT

రేపు పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమ వద్దకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం రానుంది. పేలుడుకు సంబంధించి కారణాలపై ఎన్డీఎంఏ బృందం అధ్యయనం చేయనుంది. రేపు ఉదయం ఎస్డీఎంఏ అధికారులతో కలసి షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం కలిసి పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించనుంది.

ప్రభుత్వానికి నివేదిక...
గత నెల 30వ తేదీన సిగాచీ రసాయన పరిశ్రమ మైదానంలో ప్రమాదం జరిగి నలభై రెండు మంది మరణించిన నేపథ్యంలో షనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ బృందం పర్యటించనుంది. పేలుడు జరగడానికి గల కారణాలను విశ్లేషించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా సూచించనుంది.


Tags:    

Similar News