వచ్చే రోజుల్లో మహమ్మారి వస్తుంది : భవిష్య వాణిలో స్వర్ణలత

లష్కర్ బోనాలు సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు

Update: 2025-07-14 06:47 GMT

లష్కర్ బోనాలు సందర్భంగా స్వర్ణలత భవిష్య వాణి వినిపించారు. బోనాల జాతర కు సంతోషం గా సాకలు పోసి బాగా చేసారని, ప్రతి సారి చేసినట్టే ఈ సారి కూడా పొరపాటు చేశారని పలుకులో చెప్పారు. ప్రతి సంవత్సరం చెబుతున్నప్పటికీ తన బిడ్డల ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటానని అన్నారు. నా పూజలు అన్ని సక్రమంగా జరిపించాలని, వేల రాసులు నేను రప్పించుకుంటున్నా నాకు రక్తం బలి ఇవ్వడం లేదని, మీరు మాత్రం ఆరగిస్తారు.. నాకు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు. నాకు సరిగ్గా పూజలు చెయ్యకపోతే రక్తం కక్కుకొని చస్తారని శపించారు.

పూజలు సరిగా జరపడం లేదని....
నాకు పూజలు సరిగ్గా జరిపించడం లేదని, అందుకే మరణాలు పెరుగుతున్నాయని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. నేను అస్సలు ఆ విషయం లో అడ్డుపడనని, నాకు రక్తం బలి కావాలని, నన్ను కొలిచే వారి కి నేను ఎప్పుడు తోడు గా నిలబడుతానని తెలిపారు. రాబోయే రోజుల్లో మహమ్మారి వస్తుందని, ప్రజలు జాగ్రత్త ఉండాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాలు బాగా జరుగుతాయని, ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురుస్తాయని, ఐదు వారాలు పాటు నాకు పూజలు, సాక పోసి ఆనంద పరచాలని కోరారు.నాకు రక్తం చూపించండి లేకపోతే అల్లకల్లోలం జరుగుతుందని భవిష్యవాణిని వినిపించారు. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారన్నారు.


Tags:    

Similar News