Telangana : నేడు సుప్రీంకోర్టులో అనర్హత పిటీషన్ల విచారణ
తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటీషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటీషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందుకు విచారణకు ఈ మూడు పిటీషన్లు రానున్నాయి. మొత్తం మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారడంతో వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటీషన్లు వేసింది.
మూడు పిటీషన్లపై...
అయితే దీనిపై గతంలో విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరొకవైపు తమకు మరొక రెండు నెలలు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును కోరింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొక పిటీషన్ వేశారు. ఈరోజు ఈ పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారించే అవకాశముంది.