Telangana : ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం సంచలన ఆదేశాలు
తెలంగాణ సుప్రీంకోర్టు లో ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది.
తెలంగాణ సుప్రీంకోర్టు లో ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై విచారణ జరిగింది. నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. తెలంగాణ స్పీకర్ పై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు థిక్కరణ నోటీసులను కూడా స్పీకర్ కు జారీ చేసింది. అనర్హత పై నాలుగు వారాల్లో మీరు నిర్ణయం తీసుకుంటారా? లేక మేము తీసుకుంటామా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
రెండు నెలల గడువు కావాలని...
అయితే తమకు రెండు నెలలు మరికొంత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం కోరింది. కానీ నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన వివరణ అందచేయాలని సుప్రీంకోర్టు స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీగా విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరడంతో ఇక స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.