ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. షరతులతో కూడిన బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ పోలీసు అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది
group 1 mains exam
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని సుప్రీంకోర్టు షరతులు విధించింది. పది నెలలుగా తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలులో ఉన్నారు.
ఉన్నతాధికారులతో...
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న నిందితుల్లో మొదటి సారి బెయిల్ పొందిన వారిగా తిరుపుతన్న చేరారు. అయితే సుప్రీంకోర్టు తిరుపతన్న కు బెయిల్ మంజూరు చేయడంతో వెస్ట్ జోన్ డీసీపీ అధికారులు సమీక్షించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులతో చర్చిస్తున్నారు. విదేశాల్లో ఉన్న నిందితులను ఇక్కడకు రప్పించడంపై చర్చిస్తున్నారు.