రేపు సుప్రీంకోర్టుకు బీసీ రిజర్వేషన్లు
బీసీ రిజర్వేషన్ల పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
బీసీ రిజర్వేషన్ల పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రేపు విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాధ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. బీసీ రిజర్వేషన్లు యాభై శాతం దాటాయని చెబుతూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 9ని కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును...
దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అభిషేక్ సింఘ్వి ఈ కేసును వాదించనున్నారు. ఈ కేసు రేపు విచారణకు వస్తుండటంతో వచ్చే తీర్పు పైనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రేపు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.