Breaking : స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కో్టు థిక్కార నోటీసులు
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కో్టు థిక్కార నోటీసులను జారీ చేసింది
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కో్టు థిక్కార నోటీసులను జారీ చేసింది. కోర్టు థిక్కరణ కేసులో స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో అనర్హత వేటు వేయడంలో కోర్టు ఆదేశాలను థిక్కరించారని నోటీసులో పేర్కొంది. నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గడువులోగా విచారణ...
గడువులోగా విచారణ చేయలేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసిన పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వేసిన పిటీషన్ ను, కేటీఆర్ వేసిన పిటీషన్ కు ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేసింది.