Weather Update : అవసరమైతే తప్ప బయటకు రావద్దు..నేటి నుంచి ఎండలు

నేటి నుంచి తెలంగాణలో ఎండలు పెరగనున్నాయి. మరో ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయి

Update: 2024-03-27 02:51 GMT

ap weather update, ap weather news

Weather Update :నేటి నుంచి తెలంగాణలో ఎండలు పెరగనున్నాయి. మరో ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు నుంచి మరో ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

ఎండల తీవ్రత...
ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగానే నమోదయ్యే ఛాన్స్ ఉంది. అనేక చోట్ల ఇప్పటికే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మరింత పెరగనున్నాయని చెబుతున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నీళ్లు తాగడం, నీడపట్టునే ఉండటం మంచిదని చెబుతున్నారు.


Tags:    

Similar News