Temparatures : పగటి పూట బయటకు వస్తే పకోడిలా మాడిపోవాల్సిందే.. రెడ్ జోన్ లోకి తెలంగాణ

తెలంగాణలో వేసవి ఏప్రిల్ నెలలోనే తన ప్రతాపాన్ని చూపుతుంది. . ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి.

Update: 2024-04-29 03:06 GMT

తెలంగాణలో వేసవి ఏప్రిల్ నెలలోనే తన ప్రతాపాన్ని చూపుతుంది. మే నెల ఏంటో ఏప్రిల్ నెలలోనే అందరికీ చూపుతుంది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదువుతున్నాయి. పగటి పూట బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. భయంకరమైన ఎండతోపాటు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరమైతేనే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుందంటే ఏ స్థాయిలో ఎండలు మండిపోతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు కూడా వచ్చేందుకు భయపడిపోతున్నారు.

హైదరాబాద్ నగరంతో పాటు...
ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటి పోతున్నాయంటే అతి శయోక్తి కాదు. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణ జిల్లాలో తొమ్మిది జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు అనేక జిల్లాల్లో ఎండలు మండి పోతున్నాయి. కొన్ని జిల్లాలు రెడ్ జోన్ లోకి చేరిపోయాయి. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ నిప్పుల వాన కురుస్తుంది. నడినెత్తిన భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నారు.
ఇక్కడ ఆరెంజ్ అలెర్ట్...
నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, జగిత్యాల జిల్లాలలో ఆరెెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. బయటకు వచ్చినా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు. డీహైడ్రేషన్ తో అనేక మంది ఆసుపత్రి పాలవుతున్నారని, నీరు ఎక్కువగా తాగుతూ తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News