జేఈఈ మెయిన్స్ లో మనోళ్లకే ర్యాంకులు

జేఈఈ మెయిన్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు

Update: 2025-04-19 01:58 GMT

జేఈఈ మెయిన్స్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. హైదరాబాద్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో జాతీయ స్తఆయిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డికి మూడు వందల మార్కులకు మూడు వందల మార్కులు లభించడంతో ఇద్దరికీ ఒకే ర్యాంకు దక్కింది. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలను నిన్న అర్థరాత్రి విడుదల చేశారు.

ఏపీ, తెలంగాణకు చెందిన...
ఈడబ్ల్యూఎస్ విభాగంలో వంగల అజయ్ రెడ్డికి ఫస్ట్ ర్యాంకు దక్కింది. అజయ్ రెడ్డి నంద్యాల జిల్లాకు చెందిన వారు అయినా తొమ్మిదో తరగతి నుంచే హైదరాబాద్ లో చదువుతున్నాడు. జేఈఈ పరీక్షలు మొత్తం 14.75 లక్షల మంది విద్యార్తులు రాశారు. తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష ఎ గుప్తా, అజయ్ రెడ్డి, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు.


Tags:    

Similar News