Telangana : మూడు రోజుల వరస సెలవులు
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి
dussehra holidays
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈరోజు తెలంగాణ బంద్ కావడంతో నేడు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. రేపు ఆదివారం. ఎల్లుండి దీపావళి సందర్భంగా సెలవు. దీంతో తెలంగాణలో విద్యార్థులకు వరసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు హ్యాపీ ఫీలవుతున్నారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా...
దీంతో ఎక్కువ మంది ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. అయితే నేడు బస్సులు బంద్ కావడంతో సాయంత్రం నుంచి బస్సులు తిరిగే అవకాశముందని భావించి మరికొందరు సాయంత్రానికి దీపావళిని సొంత గ్రామంలో చేసుకునేందుకు బయలుదేరి వెళుతున్నారు. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సొంతూళ్లకు పయనమయి వెళ్లారు.