Telangana : నేడు తెలంగాణలో విద్యాసంస్థల బంద్

నేడు తెలంగాణలో విద్యాసనంస్థలకు విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చాయి.

Update: 2025-07-23 02:01 GMT

నేడు తెలంగాణలో విద్యాసనంస్థలకు విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చాయి. వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ తో నేడు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతబడనున్నాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐడీఎస్వో, ఏఐఎస్బీ, ఏఐఎఫ్ డీఎస్ ఏఐపీఎస్ యూ తదితర సంఘాలు ఈ విద్యాసంస్థలకు పిలుపు నిచ్చాయి.

డిమాండ్లు ఇవే...
దీంతో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నీ నేడు బంద్ పాటించనున్నాయి. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని, ప్రయవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాలు తేవాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్, ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్ స్కాలర్ షిప్ లతో పాటు, ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News