Telangana : పరీక్షలను కూడా బంద్ చేస్తాం

తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థల బంద్ కొనసాగనుంది.

Update: 2025-11-04 02:21 GMT

తెలంగాణలో ప్రయివేటు విద్యాసంస్థల బంద్ కొనసాగనుంది. ఈరోజు నుంచి జరగనున్న పరీక్షలను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రయివేటు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీల నిధులను విడుదల చేయకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

దశల వారీ ఆందోళన...
అంతేకాకుండా దశల వారీ ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లో కళశాలలో పనిచేస్తున్న సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారు వివరించారు. అలాగే ఈ నెల 11న పది లక్షల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్న్నట్లు ప్రయివేటు విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయీలను విడుదల చేయకుండా ప్రభుత్వం తమపై విజిలెన్స్ తనిఖీలతో బ్లాక్ మెయిల్ కు దిగుతుందని వారు ఆరోపించారు.


Tags:    

Similar News