షూటింగ్ లు బంద్.. ఇళ్లల్లోనే హీరోలు

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో సమ్మె ప్రారంభమయింది. ఈరోజు నుంచి సినీ కార్మికులు సమ్మెలోకి దిగారు.

Update: 2022-06-22 04:36 GMT

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో సమ్మె ప్రారంభమయింది. ఈరోజు నుంచి సినీ కార్మికులు సమ్మెలోకి దిగారు. దీంతో పూర్తిగా సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. షూటింగ్ లు నిలిచిపోవడంతో హీరోలు, నటులు, డైరెక్టర్లు అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సమ్మె కు దిగిన కార్మికులు తమ వేతనాలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాలను సవరిస్తేనే తిరిగి షూటింగ్ లకు హాజరవుతామని వారు చెబుతున్నారు.

అత్యవసర సమావేశమై....
తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీలో నేడు సినిమా షూటింగ్ లు బంద్ అయ్యాయి. తెలుగు ఫిలిం ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. సినీ కార్మికులంతా కృష్ణానగర్ లోని తమ యూనియన్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. జూనియర్ ఆర్టిస్టులను షూటింగ్ లకు తీసుకెళ్లే బస్సులను కూడా నిలిపివేశారు. 24 క్రాఫ్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. అయితే సినీ కార్మికుల సమ్మెపై ఈరోజు అత్యవసరంగా ఫిలింఛాంబరర్ లో నిర్మాత మండలితో ఛాంబర్ సభ్యులు సమావేశం కానున్నారు. కార్మికుల సమస్యపై చర్చించనున్నారు.


Tags:    

Similar News