Telangana : నేడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు మొదటి విడత నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది.

Update: 2025-10-09 02:23 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు మొదటి విడత నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. మొదటి విడత నోటిఫికేషన్ ను నేడు విడదల చేయనుంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలంటూ పిటీషన్ దారులు కోరినప్పటికీ హైకోర్టు ధర్మాసనం స్టే ఇవ్వడానికి తిరస్కరించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేడు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది.

షెడ్యూల్ ఇదే...
నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం ఉండనుంది.తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్‌ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ జరగనుంది. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కానుంది. సర్పంచ్‌ ఎన్నికలకు అక్టోబర్‌ 31 న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబరు్ నాలుగో తేదీన, మూడో విడత నవంబరు 8వ తేదీన నిర్వహించనున్నారు. పోలింత్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నవంబరు 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 12,733 పంచయతీలకు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News