వాహనాల్లో ఓటర్ల తరలింపు నేరం

అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్‌కు తరలించడం నేరమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది

Update: 2026-02-03 06:21 GMT

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్‌కు తరలించడం నేరమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కుల, మత, భాషా పరమైన విభేదాలను సృష్టించేలా ప్రచారం చేయకూడదని సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 2026 నాటి నూతన ఎన్నికల నియమావళిని ఎస్‌ఈసీ విడుదల చేసింది.

కఠిన చర్యలు...
ఓటర్లను వాహనాల ద్వారా తరలించినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నిబంధనలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఫలితాలు వెలువడే వరకు అమలులో ఉంటాయి. నియమాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఈసీ హెచ్చరించింది


Similar News