Revanth Reddy : హైడ్రా కోసం నేడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ప్రారంభం

హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను నేడు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు

Update: 2025-05-08 03:01 GMT

ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమణలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కల్పించడమే కాకుండా దానికి అవసరమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేసే పని గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది.

హైడ్రా కోసం...
అయితే హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ను నేడు ఏర్పాటు చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు వెళ్లినప్పుడు, ఆక్రమణలను తొలగించే సమయంలో అవసరమైన భద్రతను కల్పించేందుకు ఈ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ లో ఆరుగురు ఇన్స్ పెక్టర్లు, పన్నెండు మంది ఎస్ఐలు ఉంటారు. పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News