LPG Cylinder : గ్యాస్ సిలిండర్ల కొరత లేదంటున్నా... చేతివాటంతో చుక్కలు కనిపిస్తున్నాయ్ గా

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది

Update: 2026-03-13 12:37 GMT

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో దేశంలో ఎల్.పి.జి కొరత ఏర్పడింది. దీనిని కొందరు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ఏజెన్సీలు, గ్యాస్ సరఫరా చేసే సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో పెద్దయెత్తున గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి గృహ వినియోగదారులకు, ఉజ్వల్ పథకం లబ్దిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నారు.

ధరను భారీగా పెంచి...
సిలిండర్ ధర ను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 228 కేసులు నమోదయ్యాయి. అక్రమంగా సిలిండర్లను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అయితే ఇవి అతి తక్కువ కేసులని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు పక్క దారి పడుతున్నప్పటికీ వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి అధికారులు మ..మ అని తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరొకవైపు అవసరం ఉన్నా లేకపోయినా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం కూడా ఈ రద్దీకి కారణమని అంటున్నారు.
ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా...
గ్యాస్ సిలిండర్ ఒక్కొక్కటి రెండు నుంచి మూడు వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమకు గ్యాస్ అవసరం కావడంతో వినియోగదారులు కూడా మౌనంగా వారు చెప్పిన ధరను చెల్లించి మౌనంగా ఉంటున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఏపీలో అయితే గ్యాస్ ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నప్పటికీ మెసేజ్ లు రాకపోవడంతో ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. తమకు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆన్ లైన్ ప్రకారం.. వరస క్రమంలో ఇస్తున్నామని ఏజెన్సీకి చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి గృహ వినియోగదారులను ఇబ్బందిపెట్టవద్దని ప్రజలు కోరుతున్నారు.
Tags:    

Similar News