Telangana : ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు

ఫిరాయింపులపై విచారణకు తమకు కొంత గడువు కావాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు

Update: 2025-10-31 07:39 GMT

ఫిరాయింపులపై విచారణకు తమకు కొంత గడువు కావాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికి స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేలను విచారించారని తెలిపారు. మిగిలిన వారిని విచారించేందుకు మరో రెండు నెలలు గడువు కావాలని కోరింది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రస్ లోకి ఫిరాయించారంటూ ఆ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రెండు నెలలు గడువు ఇవ్వాలని...
దీంతో సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై తేల్చాలని సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది. మూడు నెలల్లోపు విచారణ ముగించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియడంతో మరో రెండు నెలలు పొడిగించాలని స్పీకర్ కార్యాలయం తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Tags:    

Similar News