Telangana : నేటి నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేటి నుంచి చేపట్టనున్నారు

Update: 2025-09-29 02:46 GMT

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ గడ్డం ప్రసాదరావు నేటి నుంచి చేపట్టనున్నారు. స 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను విచారించడానికి స్పీకర్ గడ్డం ప్రసాదరావు సిద్ధమయ్యారు. గతఎన్నికల్లో గెలిచి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నుంచి స్పీకర్ కార్యాలయం ఇప్పటికే వివరణ తీసుకుంది.ఈరోజు నుంచి విచారణ ప్రారంభం కానుంది. వారం రోజుల్లో పది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేయాలని స్పీకర్ నిర్ణయించినట్లు తెలిసింది.

నలుగురు ఎమ్మెల్యేలు...
ఈరోజు ఉదయం పదకొండు గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు సంబంధించి విచారణ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలెయాదయ్య, మధ్యాహ్నం ఒంటి గటకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, మూడు గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఉండనుంది. ఈ విచారణకు సంబంధించి ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు హాజరై వాదనలను వినిపించేంందుకు అవకాశం కల్పించారు. మీడియాకు విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. విచారణ తర్వాత ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడకూడదు. మాజీ ఎమ్మెల్యేలకు కూడా ప్రవేశం లేదు.


Tags:    

Similar News