తెలంగాణ నుండి పోటీ చేయనున్న సోనియా గాంధీ?

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని

Update: 2023-12-18 11:07 GMT

sonia gandhi

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ షబ్బీర్ అలీ, సీనియర్ నాయకులు వీ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఇక లోక్ సభ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.

పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపామని.. ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అగ్రనాయకులందరికి పీఏసీ సమావేశంలో ధన్యవాదాలు తెలిపామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని.. అలాగే 6 హామీల అమలుపై చర్చ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై భట్టి విక్రమార్క వివరించారని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ అవకతవకలపైనా, రేషన్ కార్డు, ఆసరా పెన్షన్, మహిళలకు రూ.2500, ఇందిరమ్మ గృహాలు, గ్యాస్ ధర రూ.500పై చర్చించినట్లు చెప్పారు.


Full View


Tags:    

Similar News