విచారణకు తాత్కాలిక విరామమే

బీఆర్ఎస్ నేత హరీశ్ రావును మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు వెల్లడించారు

Update: 2026-01-21 02:41 GMT

బీఆర్ఎస్ నేత హరీశ్ రావును మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు వెల్లడించారు. నిన్న సుమారు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్ అధికారుల విచారణకు తాత్కాలిక విరామమేనని తెలిపారు. హరీశ్ రావు కుమారుడు విదేశాలకు వెళుతున్నందున విమానం సమయం అవుతుందని తెలియజేయడంతో ఆయన విచారణను ముగించామని చెప్పారు. అయితే ఈ సందర్బంగా హరీశ్ రావుకు సిట్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

త్వరలో మళ్లీ నోటీసులు...
ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయవద్దని ఆదేశించారు. మరోసారి నోటీసులు జారీ చేస్తామని, హరీశ్ రావు తర్వాత మరికొందరు ప్రముఖులను కూడా విచారించే అవకాశముందని కూడా సిట్ అధికారులు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుందని సిట్ అధికారి సజ్జనార్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ విచారిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని సజ్జనార్ తెలిపారు.


Tags:    

Similar News