నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హరీశ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది

Update: 2026-01-20 02:48 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. దీంతో సిద్దిపేటలో ఉన్న హరీశ్ రావు హైదరాబాద్ కు చేరుకున్నారు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు...
ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. అయితే సిట్ అధికారులు మాత్రం తాము అనేక మందిని విచారించిన సమయంలో హరీశ్ రావు పేరు బయటకు వచ్చిందని, అందుకే ఆయనను విచారించడానికి నిర్ణయించామని చెబుతున్నారు. హరీశ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణ నిమిత్తం వస్తున్న సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించేది లేదని తెలిపారు.


Tags:    

Similar News