నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది

Update: 2026-01-08 04:15 GMT

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉదయం11 గంటలకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, చిరుమర్తి లింగయ్యలను విచారణ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు వీరంతా విచారణకు హాజరయ్యే అవకాశముంది.

సీఎం సోదరుడు....
ఈరోజు దయం సిట్‌ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇవ్వడంతో నేడు వారు విచారణకు హాజరు కానున్నారు. గతంలో కొండల్‌రెడ్డి ఫోన్‌ట్యాప్ అయినట్టు గుర్తించిన సిట్ అధికారులు ఈ మేరకు వీరిని విచారించాలని నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత మందిని విచారించే దిశగా సిట్ అధికారులు నోటీసులు రూపొందిస్తున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News