Telangana : ఈ నెల 20న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి
సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది.
సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఈ నెల 20వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభలో జీవన్ రెడ్డి కారు పార్టీ కండువాను కప్పుకోనున్నారు.
జగిత్యాలలో భారీ బహిరంగ సభ...
కేసీఆర్ సమక్షంలోనే జీవన్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. జగిత్యాల బహిరంగ సభకు హాజరై కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కరీంనగర్ జిల్లా తో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.