రేపు హైదరాబాద్ కు దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం అవుతారు.

Update: 2022-12-21 04:19 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం అవుతారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలలో ఎక్కువ మంది వలస నేతలకు పదవులను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని కమిటీల నియామకంపై తమ నిరసనను సీనియర్ నేతలు వ్యక్తం చేశారు.

నివేదిక...
దీంతో హైకమాండ్ దిగి వచ్చింది. పార్టీ పరిశీలకుడిగా దిగ్విజయ్ సింగ్ ను హైకమాండ్ నియమించింది. నిన్న సాయంత్రం జరగాల్సిన సమావేశాన్ని దిగ్విజయ్ ఫోన్ చేసి రద్దు చేసేలా చూశారు. రేపు హైదరాబాద్ కు రానున్న డిగ్గీరాజా అందరితో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. సీనియర్ నేతల అభ్యంతరాలను విని హైకమాండ్ కు నివేదిక ఇస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News