కేసీఆర్ మీద విజయశాంతి ఫైర్

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-26 02:08 GMT

సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వ్యాపారం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరుగా చైర్మన్ రూమ్కి వెళ్లి పేపర్ లీక్ చేయొచ్చా? అంటూ విజయశాంతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నిన్న ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ వేసిందని, మరోవైపు ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. మరోవైపు ఈ కేసులో ఆధారాలు ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు సిట్ నోటీసులు అందజేసిందన్నారు.

సీబీఐ చేత...
ముందుగా తండ్రీ కొడుకులును విచారించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. వారిద్దరూ ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక ఉన్నారని జనం అనుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు ఇచ్చి దానిని కూడా అధికార పార్టీ సొమ్ము చేసుకుంటుందని విజయశాంతి ఆరోపించారు. వాస్తవాలు తేలాలంటే సీబీఐ చేత టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసలు దొంగలు తప్పించుకునే అవకాశాలున్నాయని ఆమె అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అధికార పార్టీ దొంగలు ఆ మూడింటిని కొల్లగొడుతున్నారని విజయశాంతి ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News