Schools : నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం

వేసవి సెలవులు ముగించుకుని నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి

Update: 2025-06-12 01:45 GMT

వేసవి సెలవులు ముగించుకుని నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతో నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి ప్రభుత్వ బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం నుంచి పిల్లలు కొత్త బట్టలు ధరించి, పుస్తకాలు, బ్యాగులు తీసుకుని పై తరగతిలో చదివేందుకు నేటి నుంచి సిద్ధమవుతున్నారు.

హాజరు శాతాన్ని పెంచేందుకు...
ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు ప్రారంభమయిన తొలి రోజు పిల్లలకు మిఠాయిలు తినిపించి ఆహ్వానించాలని, ప్రభుత్వ బడుల్లో విద్యార్థులచేరికతో పాటు ఈ ఏడాది ఉత్తీర్ణత శాతాన్ని కూడా పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వాతావరణం చల్ల బడటంతో ఉదయం నుంచి పిల్లలు పాఠశాలలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రయివేటు స్కూలు బస్సులు బయటకు తీసి వాటికి ఫిట్ నెస్ పరీక్షలు చేయించి సిద్ధం చేసుకున్నారు. తిరిగి నేటి నుంచి విద్యాసంస్థలు రెండు రాష్ట్రాల్లో ప్రారంభం కానుండటంతో రోడ్లపై కోలాహలం నెలకొంది.


Tags:    

Similar News