నేటి నుంచి పాఠశాలల వేళల్లో మార్పులు

ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో పాఠశాలలను గతంలో మాదిరి నిర్వహించనున్నారు

Update: 2022-04-07 01:58 GMT

ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో పాఠశాలలను గతంలో మాదిరి నిర్వహించనున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాఠశాలలను ఉదయం 7 గంటల ుంచి 11.30 గంటల వరకూ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నా ఎండలు మండిపోతుండటంతో ఒక గంట ముందుగా పాఠశాలల నుంచి విద్యార్థులను పంపించివేయాలని నిర్ణయించింది.

ఎండల తీవ్రత తగ్గడంతో.....
అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గడంతో తిరిగి పాత సమయాలనే కొనసాగించాలని, నేటి నుంచి పాత వేళల్లోనే పాఠశాలలను కొనసాగించాలని నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పాఠశాలలు కొనసాగుతాయి. పదో తరగతి విద్యార్థులకు మాత్రం స్పెషల్ క్లాస్ లను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకూ కొనసాగుతాయి.


Tags:    

Similar News